సైదాబాద్ చిన్నారి రేప్‌ ఘటనలో పోలీసుల వైఫల్యం 

V6 Velugu Posted on Sep 14, 2021

హైదరాబాద్ సైదాబాద్ సింగరేణి కాలనీలో అత్యాచారం, హత్యకు గురైన ఆరేళ్ల బాలిక కుటుంబాన్ని  బీజేపీ కోర్ కమిటీ మెంబర్ వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. నిందితుడ్ని వెంటనే పట్టుకొని.. కఠినంగా శిక్షించాలన్నారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు వివేక్ వెంకటస్వామి. కేటీఆర్ దత్తత తీసుకున్న ఈ కాలనీలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, ఈ ఘటనలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌‌ఎస్ నాయకుల కోసం మాత్రమే పోలీసులు పని చేస్తున్నారని ఆరోపించారు. రేపు గవర్నర్‌‌ను కలిసి ఈ ఘటన గురించి వివరిస్తామని వివేక్‌ వెంకటస్వామి చెప్పారు.

సింగరేణి కాలనీలో గంజాయి దొరుకుతున్నా అడ్డుకట్టే వేయడంపై పోలీసు చర్యలు లేకపోవడం దారుణమని వివేక్ అన్నారు. తప్పుడు పనులు చేసే టీఆర్‌‌ఎస్ నాయకులకు పోలీసులు సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే లెటర్లతో పోలీసులకు పోస్టింగ్స్ ఇస్తున్నారని, ఇది ఇకనైనా మారాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరేళ్ల బాలికపై ఇంతటి ఘోరం జరిగినా ఇప్పటి వరకూ టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులవరూ కనీసం కుటుంబానికి అండగా నిలుస్తామన్న భరోసా ఇచ్చేందకు రాలేదని అన్నారు.

 

Tagged Bjp, Vivek Venkataswamy, Girl rape, Saidabad rape

Latest Videos

Subscribe Now

More News