
బీజేపీ నేత జిట్టా బాలకృష్ణ రెడ్డిని అర్దరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ఘట్ కేసర్ టోల్ గేట్ సమీపంలో జిట్టాను అదుపులోకి తీసుకున్నారు. జూన్ 2 న ‘అమరుల యాదిలో ఉద్యమ ఆకాంక్షల సాధన సభ’ నిర్వహించారు. అయితే.. ఆ సభలో జిట్టా బాలకృష్ణ రెడ్డి సీఎం కేసీఆర్ ను కించపరిచే విధంగా స్కిట్ వేయించారని ఆయనపై టీఆర్ ఎస్ నేతలు ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం ఏంటని జిట్టా ప్రశ్నించారు.
ఘట్ కేసర్ టోల్ గేట్ సమీపంలో జిట్టాను అదుపులోకి తీసుకున్న పోలీసులు
— BJP Telangana (@BJP4Telangana) June 10, 2022
జూన్ 2న ‘‘అమరుల యాదిలో... ఉద్యమ ఆకాంక్షల సాధన సభ’’ నిర్వహించిన జిట్టా
కేసీఆర్ ను కించపరిచే విధంగా ఆ సభలో స్కిట్ వేయించారని టీఆర్ఎస్ నేతల ఫిర్యాదుపై జిట్టాను అరెస్ట్ చేసిన పోలీసులు pic.twitter.com/tZ8hVGGSsr
తెలంగాణ ఉద్యమకారులు ప్రజాస్వామ్యబద్దంగా సభలు, సమావేశాలు కూడా నిర్వహించుకునే హక్కులేదా..? అని నిలదీశారు. అయినా... వినకుండా పోలీసులు బలవంతంగా జిట్టాను అదుపులోకి తీసుకున్నారు. జిట్టా బాలకృష్ణ అరెస్ట్ విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీనంగన్ ఎంపీ బండి సంజయ్ ప్రభుత్వంతో పాటు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం చేశారు. ఎలాంటి నోలీసులు ఇవ్వకుండానే అర్ధరాత్రి సమయంలో ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. జిట్టా బాలకృష్ణ రెడ్డి అరెస్టు తీరును ఖండించారు. జిట్టాను తక్షణమే విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
జిట్టాకు బెయిల్ మంజూరు :
బీజేపీ నేత జిట్టా బాలకృష్ణ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం జిట్టాకు బెయిల్ మంజూరు చేసింది.