బీజేపీ నేతలు దేశద్రోహులు..ఆర్ఎస్ఎస్తో కలిసిదేశాన్ని నాశనం చేస్తున్నరు: ఖర్గే

బీజేపీ నేతలు దేశద్రోహులు..ఆర్ఎస్ఎస్తో కలిసిదేశాన్ని నాశనం చేస్తున్నరు: ఖర్గే
  •     వారిని వెంటనే అధికారం నుంచి దించేయాలి: ఖర్గే
  •     ఆ పార్టీ ఆలోచనా విధానం దేశానికి ప్రమాదకరమని ఫైర్  
  •     వారిని వెంటనే అధికారం నుంచి దించేయాలి: ఖర్గే
  •     ‘ఓట్ చోర్, గద్దీ చోడ్’ర్యాలీకి హాజరు

న్యూఢిల్లీ, వెలుగు: బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి దేశాన్ని నాశనం చేస్తున్నాయని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. బీజేపీ నేతలంతా దేశద్రోహులు అని ఆరోపించారు. ఇలాంటి వారిని వెంటనే అధికారం నుంచి దించేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

కేవలం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం మాత్రమే దేశాన్ని, రాజ్యాంగాన్ని రక్షించగలదని నొక్కి చెప్పారు. ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ఆదివారం నిర్వహించిన ‘ఓట్ చోర్, గద్దీ చోడ్’ ర్యాలీలో ఖర్గే పాల్గొని మాట్లాడారు. ఓట్లు చోరీ చేస్తున్న వాళ్లు దేశ ద్రోహులు అని, వారిని అధికారం నుంచి తొలగించి ఓటు హక్కు, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని అన్నారు. 

‘‘బీజేపీ నేతలంతా డ్రామాలాడుతున్నరు. వారి ఆలోచనా విధానా లు దేశానికి ఎంతో ప్రమాదకరం. హిందూ మతం పేరుతో సంఘ్ పరివార్.. దేశ ప్రజలను బానిసలుగా చేయాలని చూస్తున్నది. ప్రధాని మోదీ, బీజేపీ రాజ్యాంగాన్నే మార్చేందుకు కుట్రలు చేస్తున్నరు’’అని ఖర్గే మండిపడ్డారు.

దేశ ప్రజల కోసం రాహుల్ పోరాడుతున్నరు

దేశాన్ని, ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు కేంద్రంతో రాహుల్ గాంధీ పోరాడుతున్నారని ఖర్గే అన్నారు. అందరూ రాహుల్​కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ‘‘ఆదివారం బెంగళూరులో నా కొడుకు ఆపరేషన్ ఉండే. నేను వెళ్లలేదు. ‘ఓట్ చోర్, గద్దీ ఛోడ్’ ర్యాలీకి హాజరయ్యాను. ఎందుకంటే.. 140 కోట్ల ప్రజలను రక్షించడమే నాకు ముఖ్యం. వారి ఓటు హక్కు ప్రమాదంలో ఉంటే చూస్తూ ఉండలేను. 

అందుకే కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న. దేశ ప్రజలు తమ ఆత్మగౌరవాన్ని వదులుకుంటే.. బానిసలుగా మారిపోతారు. బ్రిటీష్ వారితో పోరాడి మనకు స్వాతంత్ర్యం కల్పించింది కాంగ్రెస్. ప్రధాన నరేంద్ర మోదీ కాదనేది గుర్తు పెట్టుకోవాలి. ఓటు దొంగతనం.. ఓటర్ల జాబితాల్లో అవకతవకలపై కాంగ్రెస్ చేస్తున్న పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలి’’అని ఖర్గే పిలుపునిచ్చారు.

ఈసీ స్వతంత్రను కోల్పోయింది

ఎన్నికల సంఘం తన స్వతంత్రను కోల్పోయిందని ఖర్గే విమర్శించారు. బీజేపీకి అనుకూలంగా పని చేస్తున్న దని ఆరోపించారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (సర్), ‘ఓటు చోరీ’కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతున్నదన్నారు. ‘ఓట్ చోర్, గద్దీ చోడ్’ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై దేశవ్యా ప్తంగా 5 కోట్లకు పైగా సంతకాలను సేకరించినట్టు తెలిపారు.