
కేంద్ర బడ్జెట్ ప్రచార కమిటీలో వివేక్ వెంకటస్వామికి చోటు కల్పించడంపై జగిత్యాల జిల్లాలో బీజేపీ నేతలు సంబురాలు చేసుకున్నారు. పెగడపల్లిలో బీజేపీ నాయకులు స్వీట్లు పంచుకుని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి వివేక్కు కమిటీలో చోటు కల్పించడం సంతోషం కలిగించిందని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యం అన్నారు. వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో గడప గడపకు బడ్జెట్ కేటాయింపుల వివరాలను తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని చెప్పారు. తెలంగాణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న బీజేపీ రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.