
దుండిగల్ వెలుగు: బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రాసేనా రెడ్డి త్రిపుర రాష్ట్ర గవర్నర్గా నియామకం కావడంతో ఆయనకు పలువురు బీజేపీ నేతలు విషెస్ తెలిపారు. గురువారంఇంద్రాసేనారెడ్డిని బీజేపీ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి విఘ్నేశ్వరచారి, రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఎస్. మల్లారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.
బీజేపీలో పనిచేసిన వారికి తగిన గుర్తింపు వస్తుందనడానికి తనకు దక్కిన పదవి నిదర్శమని ఇంద్రాసేనా రెడ్డి తెలిపారు. వారి వెంట బీజేపీ నేతలు పీసరి కృష్ణారెడ్డి, బక్క శంకర్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, శ్రీధర్ వర్మ తదితరులు పాల్గొన్నారు.