
వెలుగు, నెట్వర్క్: ఉమ్మడి మెదక్జిల్లాలో ఉన్న పాకిస్తాన్జాతీయులని గుర్తించి వెంటనే వారి దేశానికి పంపించేయాలని పలువురు బీజేపీ నేతలు డిమాండ్‌చేశారు. మెదక్‌పట్టణంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు వాల్దాస్రాధా మల్లేశ్‌గౌడ్, మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ పార్టీ నాయకులతో కలిసి మంగళవారం కలెక్టర్, ఎస్పీ ఆఫీసుల్లో వినతి పత్రాలను సమర్పించారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను గుర్తించి వారి దేశాలకు పంపించేలా చర్యలు తీసుకోవాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడు రాంబాబు గౌడ్ అధికారులను కోరారు. కార్యకర్తలతో కలిసి రామచంద్రాపురం తహసీల్దార్ సంగ్రామ్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. పాకిస్తాన్వారిని వెనక్కి పంపాలని ఆందోల్ బీజేపీ మున్సిపల్అధ్యక్షురాలు మహేష్కర్పావని, నియోజకవర్గ కో కన్వీనర్సుమన్తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు.
పాకిస్తాన్ అక్రమ వలసదారులపై చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు వెంకట నరసింహారెడ్డి, పోచారం రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ఎల్లన్న, కంది మండల అధ్యక్షుడు గిరిధర్ కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ రోహింగ్యాలను గుర్తించి వారి సొంత దేశాలకు పంపించేలా జిల్లా యంత్రాంగం చొరవ తీసుకోవాలని జన జాగరణ సమితి ఆధ్వర్యంలో ఎస్పీ పరితోశ్ పంకజ్ కు వినతిపత్రం సమర్పించారు.