
వెలుగు, చెన్నూరు: చెన్నూరు పట్టణానికి తలాపున గోదావరి ఉన్నా ఇల్లు కట్టుకోవడానికి ఇసుక దొరకక పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు. చెన్నూరు పరిధిలో గోదావరి ఇసుక రీచ్ కేటాయించాలని గత నాలుగు రోజులుగా ట్రాక్టర్ యజమానులు చేస్తున్న సమ్మెకు పట్టణ అధ్యక్షుడు తుమ్మ శ్రీపాల్, నాయకులతో కలిసి సంఘీభావం ప్రకటించారు. వారు మాట్లాడుతూ.. ఏండ్ల కాలంగా చెన్నూరు ప్రజలు ఇసుక కోసం ఇబ్బందులు పడుతున్నారని, గోదావరి ఇసుక కావాలంటే దళారులను ఆశ్రయించి అధిక మొత్తంలో చెల్లించి కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు.
చెన్నూరు పట్టణంలో ఇసుక రీచ్ను ఏర్పాటు చేస్తే తక్కువ ధరకు ఇసుక లభించే అవకాశం ఉన్నందన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బత్తుల సమ్మయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు రాపర్తి వెంకటేశ్వర్, పట్టణ అధ్యక్షులు తుమ్మ శ్రీపాల్, రాష్ట్ర ఓబీసీ మొర్చా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.