సీఎంను కలవాలనుకున్న బీజేపీ నేతల హౌస్ అరెస్ట్

సీఎంను కలవాలనుకున్న బీజేపీ నేతల హౌస్ అరెస్ట్

కరోనా టెస్టులను పెంచుతూ.. కరోనా బాధితులకు మరిన్ని సదుపాయాలు కల్పించాలని కోరుతూ సీఎం కేసీఆర్ ను కలిసేందుకు ప్రగతిభవన్ కు వెళ్లాలనుకున్న బీజేపీ నేతలను పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడంతో పాటు.. టెస్టుల సంఖ్యను పెంచడం, కరోనా బాధితులకు సదుపాయాలు కల్పించడం, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడం మొదలగు అంశాలతో ‘సేవ్ హైదరాబాద్’పేరుతో సీఎం కేసీఆర్ ను కలవాలని బీజేపీ నేతలు రెండు రోజులుగా అపాయింట్మెంట్ కోరితే సీఎం ఆఫీస్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దాంతో ప్రగతి భవన్ కు వెళ్లాలని బీజేపీ నేతలు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎమ్మెల్యే రాజాసింగ్ నిర్ణయించారు. దాంతో వారందరినీ పోలీసులు శుక్రవారం ఉదయం హౌస్ అరెస్టు చేశారు. హైదరాబాద్ లో కరోనా కేసులు పెరుగుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. ఎక్కువ సంఖ్యలో టెస్టులు చేయడం లేదని వారన్నారు. వైద్యులకు, సిబ్బందికి రక్షణ కల్పించడం లేదని బీజేపీ నేతలు అన్నారు.

For More News..

షరతుల సాగుకు బయో పెస్టిసైడ్స్ రెడీ

ఏనుగులకు 5 కోట్ల ఆస్తి రాసిచ్చిన జంతు ప్రేమికుడు

టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్