మోదీ నేతృత్వంలోనే..దేశం అభివృద్ధి చెందింది

మోదీ నేతృత్వంలోనే..దేశం అభివృద్ధి చెందింది

ఖమ్మం టౌన్/మధిర/కుసుమంచి/కారేపల్లి, వెలుగు :  ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోనే  దేశం అభివృద్ధి చెందిందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేందర్ నాథ్ పాండే, బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు అన్నారు. మంగళవారం ఖమ్మం పట్టణంతోపాటు మధిర, కుసుమంచి, కామేప  చేపట్టిన విజయ సంకల్పయాత్ర, ప్రెస్​మీట్​లలో వారు మాట్లాడారు. దేశంలో ప్రజా సంక్షేమాన్ని అమలు చేస్తూ వ్యవసాయ రంగాన్ని,  పారిశ్రామికీకరణను , రైల్వే ఆధునికరణ తోపాటు అన్ని రంగాల్లో లక్షల కోట్ల రూపాయలతో అభివృద్ధిని బీజేపీ ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు.

పార్టీకి నలుగురు ఎంపీలు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 9 లక్షల కోట్లతో..  ప్రత్యేకించి ఖమ్మం జిల్లాలో 8వేల కోట్లతో జాతీయ రహదారుల విస్తరణను చేపడుతున్నట్లు చెప్పారు. తెలంగాణాలో కాంగ్రెస్, కమ్యూనిస్టు రాజకీయాలు దందాలు ప్రజలకు తెలుసన్నారు. గుజరాత్ రాష్ట్రంలో సీఎం గా మోదీ 13 ఏళ్లు పనిచేసి నీతివంతమైన పాలనను అందించారని గుర్తు చేశారు. తర్వాత పదేండ్లు ప్రధానిగా అవినీతి లేని పాలనను మోదీ అందించారని చెప్పారు.

ఓర్వలేక కాంగ్రెస్ విషప్రచారం చేస్తోందని ఆరోపించారు. కారేపల్లిలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీతో సంకల్ప యాత్ర కు స్వాగతం పలికారు. వారి వెంట బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డితోపాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు. 

బీజేపీ 370 సీట్లు గెలుస్తుంది...

ఖమ్మం టౌన్ : రాబోయే పార్లమెంట్​ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ నినాదంతో బీజేపీ 370 సీట్లు గెలవనుందని, మూడోసారి మోదీ ప్రధాని కానున్నారని ఖమ్మం పార్లమెంట్​ బీజేపీ అభ్యర్థి డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు తెలిపారు. ఖమ్మం సిటీలో మంగళవారం జరిగిన ‘కాకతీయ - భద్రకాళీ క్లస్టర్ విజయ సంకల్పయాత్ర’లో  ఆయన మాట్లాడారు.

ఖమ్మం అసెంబ్లీలోని పాత బస్టాండ్ సెంటర్లో జరిగిన బహిరంగసభకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే హాజరయ్యారు. పెద్ద ఖ్యలో యువకుల బైక్ లు, కార్ల ర్యాలీల నిర్వహించారు. లంబాడీ మహిళల నృత్యాలు, కోలాటాలు, డప్పుల మోతలతో ఖమ్మం నగరమంతా మార్మోగింది.