జనగామ అర్బన్, వెలుగు: స్వతంత్ర ఉద్యమంలో వందేమాతర గేయం భారతీయులను ఐక్యం చేసిందని బీజేపీ రాష్ట్ర నాయకులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో వందేమాతర గేయం రచించి 150 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ ఆధ్వర్యంలో నెహ్రూ పార్క్ నుంచి రైల్వే స్టేషన్ వరకు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా బీజేపీ రాష్ట్ర నాయకులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ భారతీయుల గుండెల్లో నింపి స్వాతంత్ర్యం తీసుకురావడంలో కీలక పాత్ర వందేమాతరం గేయం వహించిందని, విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించాలన్నారు. కార్యక్రమమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఆరుట్ల దశమంతరెడ్డి, కేవీఎల్‌ఎన్‌రెడ్డి, ఉడుగుల రమేశ్, మహాంకాళి హరిశ్చంద్రగుప్త, డాక్టర్ కల్నల్ భిక్షపతి, విద్యార్థులు పాల్గొన్నారు.
