
నరేంద్ర మోడీ రెండోసారి ప్రధానమంత్రి కావాలని ఆదిలాబాద్ లో సుదర్శన యాగం నిర్వహించారు బీజేపీ నేతలు. ఆదిలాబాద్ నగరం.. ప్రగతి విద్యాలయంలో జరిగిన హోమం, పూర్ణాహుతి కార్యక్రమానికి కమలం నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. దేశం మొత్తం మోడీ హవా కొనసాగుతుందన్నారు బీజేపీ నేతలు. ఎన్నికల ఫలితాల్లో మోడీ ప్రభంజనమే ఉంటుందన్నారు.