హీరో జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టుకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు. ఇటీవల ఎన్టీఆర్ తన వ్యక్తిగత హక్కుల (పర్సనాలిటీ రైట్స్) పరిరక్షణ కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేయగా సోమవారం ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అనుమతి లేకుండా తన పేరు, మూవీ, వాయిస్ లాంటివన్నీ వాణిజ్య ప్రకటనల్లో గానీ, సోషల్ మీడియాలోని గానీ ఎలాంటి దుర్వినియోగం చేయకుండా కోర్టు తీర్పును ఇచ్చింది.
దీంతో ఢిల్లీ హైకోర్టుకు స్పెషల్ థ్యాంక్స్ చెబుతూ సోషల్ మీడియాలో ఓ నోట్ విడుదల చేశాడు ఎన్టీఆర్. ఈ న్యాయ పోరాటంలో తనకు సపోర్ట్‌గా నిలిచిన సుప్రీంకోర్టు న్యాయవాదులు డాక్టర్ బాలజానకి శ్రీనివాసన్, డాక్టర్ అల్కా డాకర్‌లతో పాటు రైట్స్ అండ్ మార్క్స్ సంస్థకు చెందిన రాజేందర్, ఆయన టీమ్‌కు ఎన్టీఆర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశాడు.
ఇక పర్సనాలిటీ రైట్స్ విషయంపై ఇప్పటికే చిరంజీవి సహా పలువురు స్టార్స్ కోర్టులో తమకు అనుకూలంగా తీర్పును అందుకున్నారు. ప్రస్తుతమున్న డిజిటల్ ఎరాలో తమ వ్యక్తిగత హక్కులకు భంగం వాటిల్లకుండా కోర్టు రక్షణ కల్పించింది.
ఈ తీర్పు పట్ల మరోసారి సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
