కోటగిరిని ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దాలి : డాక్టర్ ఎంఏ హకీమ్

కోటగిరిని ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దాలి : డాక్టర్ ఎంఏ హకీమ్
  • ప్రముఖ సామాజిక కార్యకర్త డాక్టర్ ఎంఏ హకీమ్ 

కోటగిరి, వెలుగు : కోటగిరి సర్పంచ్ బర్ల మధుకర్ కు రాష్ట్రస్థాయిలోనే అత్యధిక మెజార్టీ (4210) రావటం గొప్ప విషయమని, పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దాలని  ప్రముఖ సామాజిక కార్యకర్త డాక్టర్.ఎంఏ హకీమ్ అన్నారు.  సోమవారం కోటగిరి గ్రామపంచాయతీలో శాలువా పూలమాలతో సర్పంచ్ బర్ల మధుకర్ ను  ఘనంగా సన్మానించి ఆయన మాట్లాడారు.  కోటగిరి ప్రజలందరూ ఏకపక్షంగా మద్దతు తెలుపడం అభినందనీయమన్నారు.  మనం నిత్యం ప్రజల్లో ఉండి ప్రజాసేవ చేస్తే ప్రజలందరూ ఇలాంటి ఫలితాలు ఇస్తారని అన్నారు. 

అనంతరం రాంపూర్ సర్పంచ్ విస్లావత్ సాంకీ బాయిని హకీం సన్మానించారు. ఉమ్మడి కోటగిరి మండల ఫీల్డ్ అసిస్టెంట్లు  కోటగిరి సర్పంచ్ బర్ల మధుకర్, రాంపూర్ సర్పంచ్ సాంకీ బాయి ని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు దేవి సింగ్, నారాయణ, పోశెట్టి, వెంకటలక్ష్మి, ఆంజనేయులు, కిషన్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.