అప్పలసూరిగా జగపతి బాబు.. గట్టిగానే ప్లాన్ చేసిన బుచ్చిబాబు

అప్పలసూరిగా జగపతి బాబు.. గట్టిగానే ప్లాన్ చేసిన బుచ్చిబాబు

సెకండ్ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో వైవిధ్యమైన పాత్రలతో దూసుకెళ్తున్న జగపతిబాబు.. ప్రేక్షకులు మునుపెన్నడూ చూడనంత న్యూ లుక్‌‌‌‌‌‌‌‌లో కనిపించి సర్‌‌ప్రైజ్  చేయబోతున్నారు. రామ్ చరణ్‌‌‌‌‌‌‌‌ హీరోగా బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ చిత్రంలో ఆయన కీలక పాత్రను పోషిస్తున్నారు. 

సోమవారం ఆయన పోషిస్తున్న పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. ‘అప్పలసూరి’ అనే ఓల్డ్ ఏజ్‌‌‌‌‌‌‌‌ గెటప్‌‌‌‌‌‌‌‌లో జగపతిబాబు కనిపించగా..  ఆయన మేకప్, మేకోవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుర్తు పట్టలేనట్టుగా ఉంది.  క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఇంటెన్సిటీని బట్టి కథలో ఎంతో ప్రాధాన్యత గల పాత్రను పోషిస్తున్నట్టు అర్థమవుతోంది.

ఇక  చరణ్‌‌‌‌‌‌‌‌కు జంటగా జాన్వీకపూర్ నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ  స్టార్ శివ రాజ్‌‌‌‌‌‌‌‌కుమార్, బాలీవుడ్ నటులు బోమన్ ఇరానీ, దివ్యేందు శర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్‌‌‌‌‌‌‌‌తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఏఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.  ఇప్పటికే విడుదలైన చికిరి పాటకు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది.  రామ్ చరణ్‌‌‌‌‌‌‌‌ బర్త్ డే సందర్భంగా మార్చి 27న సినిమా విడుదల కానుంది.