రూ.99 టికెట్‌‌‌‌‌‌‌‌తో సైక్ సిద్ధార్థ

రూ.99 టికెట్‌‌‌‌‌‌‌‌తో సైక్ సిద్ధార్థ

నందు హీరోగా నటిస్తూ శ్యామ్ సుందర్ రెడ్డితో కలిసి నిర్మించిన చిత్రం ‘సైక్ సిద్ధార్థ’. వరుణ్ రెడ్డి దర్శకుడు. యామిని భాస్కర్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటించింది. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా, సురేష్​ ప్రొడక్షన్స్ ద్వారా  జనవరి 1న థియేట్రికల్ రిలీజ్ అవుతోంది.

ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌లో నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ ‘కంటెంట్ బాగున్న చిన్న చిత్రాలను ప్రేక్షకులు చాలా బాగా ఆదరిస్తున్నారు.  డైరెక్టర్ వరుణ్  ఈ సినిమాను డిఫరెంట్‌‌‌‌‌‌‌‌గా ప్రజెంట్ చేయడంతో చూసిన వెంటనే రిలీజ్ చేయాలనుకున్నా.  ఈ సినిమా టికెట్ కూడా కేవలం 99 రూపాయలు మాత్రమే. ప్రతి ఒక్కరూ చూసి హిట్ చేస్తారని ఆశిస్తున్నాం’ అని అన్నారు.

నందు మాట్లాడుతూ ‘కొత్త ఏడాది మా సినిమాతో ప్రారంభం కావడం ఆనందంగా ఉంది.  హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. సెకండ్ హాఫ్ ఎమోషనల్‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది. అది కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’ అని చెప్పాడు.

జీవితంలో సెకండ్ ఛాన్స్ చాలా ఇంపార్టెంట్ అని, ఈ సినిమా తన కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సెకండ్ ఛాన్స్ లాంటిదని యామిని భాస్కర్ చెప్పింది.  థియేటర్స్‌‌‌‌‌‌‌‌లో గట్టిగా కేకలు వేసి ఫుల్‌‌‌‌‌‌‌‌గా ఎంజాయ్ చేసే తెలుగు ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌కి ఈ సినిమా అంకితం అని  డైరెక్టర్ వరుణ్ రెడ్డి అన్నాడు.  ఇదొక ఫన్ మూవీ అని  మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ సాయి అన్నాడు.