- ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ
కామారెడ్డి, వెలుగు : అన్ని మతాలకు సమాన గౌరవం ఇస్తూ , మత సామరస్యాన్ని బలోపేతం చేసేలా ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొస్తుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ పేర్కొన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లిమ్రా ఫంక్షన్ హాల్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. క్రైస్తవ, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గతంతో పోలిస్తే క్రైస్తవులకు ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో క్రైస్తవ సమాజానికి అవసరమైన మౌలిక వసతులు, సంక్షేమ కార్యక్రమాలు విస్తృతంగా అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో చర్చి పాస్టర్లు, ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డిలో మౌలిక వసతుల కల్పనకు కృషి
కామారెడ్డిటౌన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రయార్టీ ఇస్తుందని ప్రభుత్వ సలహాదరారు షబ్బీర్అలీ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని 33, 34, 46 వార్డుల్లో రూ. 30 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను షబ్బీర్అలీ ప్రారంభించి మాట్లాడారు. అభివృద్ధి విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. రానున్న రోజుల్లో పట్టణంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామన్నారు. మాజీ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
