పెద్దపల్లిలో బీజేపీ లీడర్ల నిరసన 

పెద్దపల్లిలో బీజేపీ లీడర్ల నిరసన 

పెద్దపల్లి, వెలుగు: బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్​ వివేక్​ వెంకటస్వామిని పోలీసులు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని పెద్దపల్లి జిల్లా బీజేపీ లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం బూర్గుల్ లో బీజేపీ లీడర్లతో కలిసి జెండా ఆవిష్కరిస్తుండగా అడ్డుకున్నారన్నారు. దీనికి నిరసనగా పెద్దపల్లిలో జిల్లా బీజేపీ లీడర్లు ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. 
నల్ల రిబ్బన్లతో మౌన దీక్ష చేసి నిరసనలు తెలిపారు, మంథని నియోజకవర్గ లీడర్​ సునీల్​రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంతోపాటు, సుల్తానాబాద్ పట్టణంలో నిరసన తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో బీజేపీ లీడర్లు సజ్జాద్, ఎలిగేడు శ్రీనివాస్, మహంతకృష్ణ, దుబాసి మల్లేశ్, మారం వెంకటేశ్, రాచకొండ కోటేశ్వర్లు, సునీల్​కుమార్, వేల్పుల రాజు, ఎడ్ల సదాశివ్, బోగోజు శ్రీనివాస్, బోయిని నారాయణ, క్రాంతి, సంతు, సూర్య, మల్లేశ్ తదితరులు ఉన్నారు.