
మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని బీజేపీ నేతలు అన్నారు. వచ్చే నెల 26న జరిగే ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఆహ్వానించామని చెప్పారు. హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలో మూడో విడత పాదయాత్ర పోస్టర్ ను బీజేపీ నేతలు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగాఆగస్ట్ 2న పాదయాత్ర ప్రారంభించే రోజున యాదగిరిగుట్టలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని పాదయాత్ర ఇంఛార్జ్ మనోహర్ రెడ్డి చెప్పారు.