ప్రోటోకాల్ పాటించడం తెలియదా.. కేసీఆర్ పై బీజేపీ ఫైర్

ప్రోటోకాల్ పాటించడం తెలియదా.. కేసీఆర్ పై బీజేపీ ఫైర్

సీఎం కేసీఆర్ పై బీజేపీ సీనియర్ లీడర్లు విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ వచ్చినప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులను పంపించడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని ముందు నిలబడటానికి కూడా కేసీఆర్ ఎందుకు రావడం లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. అలాగే.. కాంగ్రెస్ పార్టీ పైనా ఆమె విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రిని విమర్శించే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని ఆమె అన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని కాంగ్రెస్ హయాంలో పూర్తి చేస్తే.. ఇప్పటివరకు ఎందుకు ప్రారంభించలేదని ఆరోపించారు. ఇప్పుడు బీజేపీ నిర్వహిస్తున్నది ఎన్నికల సభ కాదని హామీలు ఇచ్చేందుకు ఇంకా చాలా సమయం ఉందని డీకే అరుణ చెప్పారు.

సీఎం కేసీఆర్ కు ప్రోటోకాల్ పాటించే పద్దతి తెలియదా అని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రధాని వస్తుంటే సీఎం స్వాగతం పలుకాలనే విషయం కూడా తెలియదా అని ఘాటుగా ప్రశ్నించారు. నగరంలో మోడీ గో బ్యాక్ అంటూ వెలసిన ఫ్లెక్సీలను  వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని ఆయన చెప్పారు. రైతుల కోసం రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభిస్తున్నట్లు జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రజలకు అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని.. కేంద్ర ప్రభుత్వ సాయంతోనే చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.