భద్రాచలంలో ముక్కోటికి పటిష్ట బందోబస్తు : ఎస్పీ బి. రోహిత్ రాజు

భద్రాచలంలో  ముక్కోటికి పటిష్ట బందోబస్తు : ఎస్పీ బి. రోహిత్ రాజు
  •     యాక్సిడెంట్స్​ నివారణపై  దృష్టి పెట్టాలి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాచలంలో ఈ నెల 29, 30 తేదీల్లో జరగనున్న ముక్కోటి వైకుంఠ ఏకాదశి, తెప్పోత్సవాల సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ బి. రోహిత్​ రాజు తెలిపారు. పోలీస్​ హెడ్​ క్వార్టర్​లో మంగళవారం నిర్వహించిన క్రైం రివ్యూ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. ముక్కోటికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు  కలుగకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలన్నారు.

 ట్రాఫిక్​ నియంత్రణపై దృష్టి పెట్టాలని సూచించారు. రోడ్​ యాక్సిటెంట్ల నివారణకు పక్కాగా ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు. నిత్యం వాహనాలను తనిఖీ చేయాలన్నారు. డ్రంకెన్​ డ్రైవ్​ నిర్వహించాలని సూచించారు. పెండింగ్​లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించేందుకు ప్లాన్​ చేసుకోవాలన్నారు. 

కోడి పందేలు, బెట్టింగులతో పాటు అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడే వారిపై నిఘా పెట్టాలని సూచించారు. ప్రతి పోలీస్​ స్టేషన్​ పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్​ కుమార్​ సింగ్​, డీఎస్పీలు రెహమాన్​, మల్లయ్య స్వామి, ఎస్బీ ఇన్సిపెక్టర్​ శ్రీనివాస్​, సీసీఎస్​ ఇన్​స్పెక్టర్​ రమాకాంత్, ఐటీ సెల్​ సీఐ రాము పాల్గొన్నారు.