- బండరాయి తలపై వేసి కాంగ్రెస్ నేత హత్యకు కుట్ర
- వనపర్తి జిల్లా నాటవల్లి గ్రామంలో ఘటన
కొత్తకోట, వెలుగు : కాంగ్రెస్ మండల అధ్యక్షుడి హత్యకు యత్నించిన ఘటన వనపర్తి జిల్లాలో జరిగింది. కొత్తకోట మండలం నాటవల్లి సర్పంచ్ బొందల ప్రశాంత్ తెలిపిన మేరకు.. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతో బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోయారు.
సోమవారం సర్పంచ్ ప్రమాణస్వీ కారం తర్వాత సాయంకాలం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీచ్ పల్లి యాదవ్ కు బీఆర్ఎస్ నేత అశోక్ ఫోన్ చేసి బూతులు తిట్టాడు. అనంతరం ‘బీచుపల్లి బ్రిడ్జి వద్దకు రా మాట్లాడుదాం’.. అని నెహ్రు, అశోక్, రమేశ్ పిలవడంతో అక్కడికి యాదవ్ వెళ్లాడు. మళ్లీ ఫోన్ చేసి వెనక్కి రావాలని చెప్పగా.. యాదవ్ తన కార్యకర్తలు, అనుచరులతో కలిసి టీఆర్ఎస్ సర్పంచ్ క్యాండిడేట్ పద్మ నెహ్రూ ఇంటికి వెళ్లారు.
అనంతరం అబ్దుల్, రాజు, రవిపై బీఆర్ఎస్ నేతలను కట్టెలతో కొడుతుండగా యాదవ్ అడ్డుకోబోయాడు. అనంతరం మిద్దెపై నుంచి అశోక్ పెద్ద బండ రాయిని అతని తలపై వేయడంతో తల పగిలి స్పృహ కోల్పోయాడు. వెంటనే యాదవ్ ను కొత్తకోటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కండీషన్ సీరియస్ గా ఉందని డాక్టర్లు మహబూబ్ నగర్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడ డాక్టర్లు ఎంఆర్ఐ స్కాన్ తీసి యాదవ్ తలలోని ఎముక విరిగినట్లు తెలిపారు. ప్రస్తుతం యాదవ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సర్పంచ్ ప్రశాంత్, బాధితుడి అనుచరులు తెలిపారు.
