ముషీరాబాద్, వెలుగు: తల్లిదండ్రులు మార్కులు, ర్యాంకులు అంటూ పిల్లలపై ఒత్తిడి తేవొద్దని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ సూచించారు. పిల్లల భవిష్యత్తుకు మార్కులు ప్రామాణికం కాదనే విషయాన్ని గుర్తించాలన్నారు.
మంగళవారం ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న బుక్ ఫెయిర్ లో డాక్టర్ సురేంద్ర బాబు రచించిన ‘పరీక్షల్లో విజయానికి 18 సూత్రాలు’ అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బట్టి చదువులకు స్వస్తి పలకాలని విద్యార్థులకు సూచించారు.
