
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకోనున్నారు బీజేపీ కార్పొరేటర్లు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం 8:30 గంటలకు పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ ఆలయానికి వెళ్లనున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పలువురు బీజేపీ నేతలు, కొత్తగా ఎన్నికైన జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు.