అక్టోబర్ వరకు మేరా మాటీ.. మేరా దేశ్

అక్టోబర్ వరకు మేరా మాటీ.. మేరా దేశ్
  • గ్రామాల్లో అమరుల కుటుంబాలకు సన్మానం : బీజేపీ

హైదరాబాద్, వెలుగు: ‘మేరామాటీ.. మేరాదేశ్’ కార్యక్రమాన్ని అక్టోబర్ వరకు కొనసాగిస్తున్నట్లు బీజేపీ నాయకత్వం మంగళవారం ప్రకటించింది. ఢిల్లీలో నిర్మిస్తున్న అమరవీరుల స్మారక స్థూపం నిర్మాణంలో రాష్ట్రంలోని ప్రతి ఊరి నుంచి మట్టిని సేకరించి పంపించాలని సూచించింది. దీంతో పాటు టెర్రరిస్టులు, నక్సలైట్లు, రజాకార్ల చేతిలో అమరులైన వారికి గ్రామాల్లో నివాళులర్పించే ప్రోగ్రామ్​ను ఏర్పాటు చేయాలని తెలిపింది. వారిని ఎప్పుడూ స్మరించుకునే రీతిలో గ్రామం చివర ఉన్న చెరువుల వద్ద అమరుల స్మారక స్థూపం నిర్మించడం, వారి కుటుంబ సభ్యులను సన్మానించడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించింది. యువతలో దేశభక్తి పెంపొందించే దిశగా కార్యక్రమాలు నిర్వహించాలని లీడర్లకు సూచించింది. ప్రతి పల్లెలో తిరంగ యాత్రలు చేపట్టాలని ఆదేశించింది.