అయితే బాడీ షేమ్ చేయలేదంటావా? నటిస్తూ చెప్పిన నీ సారీ అవసరం లేదు: అస్సలు విడిచిపెట్టను అంటున్న హీరోయిన్

అయితే బాడీ షేమ్ చేయలేదంటావా? నటిస్తూ చెప్పిన నీ సారీ అవసరం లేదు: అస్సలు విడిచిపెట్టను అంటున్న హీరోయిన్

96’ సినిమాలో టీనేజీ ‘జాను’గా నటించిన మలయాళీ అమ్మాయి గౌరీ జి. కిషన్​ (Gouri Kishan) పరిచయం అక్కర్లేని పేరు. అమ్మాయనగానే.. అమాయకత్వంతో కూడిన అందమైన ముఖం కళ్లముందుకొస్తుంది. ఆ ఒక్క సినిమాతో ఆడియెన్స్​ మనసు దోచేసింది. ఆ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోయేలా నటించి మెప్పించింది.

అయితే, నటి గౌరీ కిషన్ ఇటీవల యూట్యూబర్ కార్తీక్పై తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. బాడీషేమింగ్‌ చేస్తున్నారంటూ ఎడపెడా మాట్లాడుతూ యూట్యూబర్ కార్తీక్కి గట్టిగా క్లాస్ పీకింది. 'మీ బరువెంత?' అని యూట్యూబర్ కార్తీక్ అడగడం, దానికి గౌరీ రిటర్న్ కౌంటర్ ఇవ్వడం, ఆ మరుసటి రోజే యూట్యూబర్  క్షమాపణలు చెప్పడం.. ఇలా ఓ మూడు రోజుల పాటు ఈ వివాదం నడిచింది. దీంతో సోషల్ మీడియాలో ఈ వివాదం పెద్ద చర్చనీయాంశమైన మారి, సినిమా పరిశ్రమలో వృత్తిపరమైన ప్రమాణాలపై గట్టి డిమాండ్ తీసుకొచ్చింది.

ఈ క్రమంలోనే దక్షిణాది నటీనటుల సంఘం (SIAA) ప్రెసిడెంట్ నాజర్ రియాక్ట్ అయ్యి తీవ్రంగా ఖండించారు. జర్నలిజం ముసుగులో ఇటువంటి అనైతిక చర్యలను తాము సహించబోమని, మహిళా నటీమణుల పట్ల గౌరవం తప్పనిసరి అని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇదిలా ఉంటే.. 

లేటెస్ట్ విషయానికి వస్తే.. యూట్యూబర్ కార్తీక్ క్షమాపణ వీడియో విడుదల చేసిన అనంతరం.. మరోసారి గౌరీ కిషన్ స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చింది. తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా యూట్యూబర్ను టార్గెట్ చేస్తూ నోట్ రిలీజ్ చేసింది. అతని క్షమాపణ వీడియోలో జవాబుదారీతనం లేదని, అది కేవలం నిజాయితీ లేని ప్రవర్తనలా ఉందని గౌరి విమర్శించింది. ఈ క్రమంలోనే “జవాబుదారీతనం లేని క్షమాపణ, అసలు క్షమాపణే కాదు” అని గౌరీ సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది. 

“ముఖ్యంగా.. ఆమె నా ప్రశ్నని తప్పుగా అర్థం చేసుకుంది. ఇది కేవలం సరదాగా అడిగాను. నేను ఎవరినీ బాడీ షేమింగ్ చేయలేదు' లాంటి మాటలు మాట్లడటం అస్సలు కరెక్ట్ కాదు. ఈ సారీని నేను అంగీకరించట్లేదు' అని గౌరీ కిషన్.. యూట్యూబర్ కార్తీక్ వీడియోని రీట్వీట్ చేసింది. ఇలా నటనతో కూడిన పశ్చాత్తాపాన్ని లేదా పొగరు మాటలను ఏ మాత్రం అంగీకరించను. ఇంకాస్త బాగా చేయండి ఆర్ఎస్ కార్తీక్” అని చివర్లో రాసి గట్టి రిప్లయ్ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.