హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సంబంధించి పోలింగ్ ముగిసింది. 2025 నవంబర్ 11వ తేదీన సాయంత్రం 6 గంటలకే పోలింగ్ ముగిసినప్పటికీ.. క్యూ లైన్లలో ఉన్న వారికి అవకాశం కల్పించిన తర్వాత.. ఈవీఎం మెషీన్లను భద్రతంగా ప్యాక్ చేసి స్ట్రాంగ్ రూమ్ లకు తరలించారు. భారీ భద్రతల నడుమ EVM లను స్ట్రాంగ్ రూమ్ కు తీసుకెల్లారు.
పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎం మెషిన్లను యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు ఎన్నికల అధికారులు. జూబ్లీహిల్స్ లో నాలుగు లక్షల పైగా ఓటర్లు ఉండటంతో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల నుంచి ఎన్నికల ఈవీఎంలు, వీవీ పాడ్లు కలిగిన ప్రత్యేక వాహనంలో పోలీస్ బందోబస్తు నడుమ స్ట్రాంగ్ రూమ్ కు చేరుకున్నాయి.
పోలింగ్ వాహనాల కోసం ట్రాఫిక్ అధికారులు ప్రత్యేక యంత్రాంగాన్ని సిద్ధం చేశారు. ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. బోరాబండ డివిజన్ నుండి ఈవీయం లను తరలించారు ఎన్నికల సిబ్బంది. అదే విధంగా షేక్ పేట్ డివిజన్ కేం బ్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి కోట్ల విజయభాస్కర్ ఇండోర్ స్టేడియంలో ఉన్న స్ట్రాంగ్ రూమ్ కు ఈవీఎం తరలించారు. మరికొన్ని పోలింగ్ స్టేషన్ లలో ఉన్న ఈవీఎంలను తరలిస్తున్నారు.
►ALSO READ | నవంబర్ 14న భారీ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలవబోతున్నాడు: మంత్రి వివేక్
జూబ్లీహిల్స్‌లో నియోజకవర్గంలో మొత్తం 4 లక్షల13 వందల 65 మంది ఓటర్లు ఉండగా.. 58 మంది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అందులో కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ అభ్యర్తిగా లంక దీపక్ రెడ్డి బరిలో దిగారు. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు, అదే రోజు ఫలితాల ప్రకటన ఉంటుంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భాగంగా 2025 నవంబర్ 11న ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం మందగొడిగా మొదలైన పోలింగ్.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 31.94 శాతం పెరిగింది. ఆ తర్వాత ఓటింగ్ శాతం పెరుగుతూ వచ్చింది. మధ్యా్హ్నం 3 గంటలకు 40.2 శాతం ఉన్న పోలింగ్.. సాయంత్రానికి 47.16 శాతానికి చేరుకుంది.
