నవంబర్ 14న భారీ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలవబోతున్నాడు: మంత్రి వివేక్

నవంబర్ 14న భారీ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలవబోతున్నాడు: మంత్రి వివేక్

మంగళవారం ( నవంబర్ 11 ) జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ముగిసిన క్రమంలో మీడియా మాట్లాడారు మంత్రి వివేక్. షేక్ పేట్ డివిజన్ తో పాటు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకున్న వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. నవంబర్ 14న మంచి మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలవబోతున్నాడని అన్నారు మంత్రి వివేక్. గతంలో టిఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఉన్నవారు అభివృద్ధి పనులు చేయలేదని.. గతంలో కేటీఆర్ సారు కారు 16 అన్న మాటల కు 2023 లో  ప్రజలు BRS కు బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు మంత్రి వివేక్.

జూబ్లీహిల్స్ లో అభివృద్ధి చేయబోతున్నామని.. మూడు నెలలుగా జూబ్లీహిల్స్ లో తనతోపాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,నాయకులు , డివిజన్ నాయకులు, బూత్ ఇన్చార్జులు కార్పొరేషన్ చైర్మన్లు కష్టపడ్డారని.. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు మంత్రి వివేక్. 

ఈ మూడు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీని ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చామని.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ పథకాలను అందరికీ అందిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించామని అన్నారు మంత్రి వివేక్.