IPL 2026: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎవరు..? అశ్విన్ ఏమన్నాడంటే..?

IPL 2026: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎవరు..? అశ్విన్ ఏమన్నాడంటే..?

ఐపీఎల్ 2026కి ముందు సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ ట్రేడింగ్ చేసుకుంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తమ జట్టులోకి  రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ను ట్రేడింగ్ ద్వారా తీసుకోనుంది. శాంసన్ చెన్నై జట్టులోకి వస్తే ట్రేడింగ్ ద్వారా వారు జడేజాతో పాటు ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ సామ్ కరణ్ ను రాజస్థాన్ కు ఇవ్వడానికి అంగీకరించినట్టు తెలుస్తుంది. శాంసన్ చెన్నై జట్టులోకి రావడం దాదాపు ఖరారైన నేపథ్యంలో ఇప్పుడు సూపర్ కింగ్స్ కు కొత్త కెప్టెన్ ఎవరనే విషయంలో చర్చ మొదలైంది. 

ఐపీఎల్ 2025లో ధోనీ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా ప్రకటించారు. గైక్వాడ్ కొన్ని మ్యాచ్ ల్లో కెప్టెన్సీ చేసినప్పటికీ చెన్నై ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది. ఒక రకంగా చెప్పాలంటే గైక్వాడ్ కెప్టెన్ గా కొన్ని మ్యాచ్ ల్లో విఫలయ్యాడు. ఇప్పుడు శాంసన్ ను ట్రేడింగ్ ద్వారా తీసుకోవడంతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ కు కెప్టెన్సీ ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై టీమిండియా మాజీ స్పిన్నర్.. రవి చంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నాడు. శాంసన్ కు తొలి సీజన్ లోనే సారధ్య బాధ్యతలు అప్పగించరని తెలిపాడు. 

అశ్విన్ మాట్లాడుతూ ఇలా అన్నాడు.. "సంజుకి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ ఇస్తారని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఇది అతని మొదటి సీజన్. CSK మేనేజ్ మెంట్ శాంసన్ కు కెప్టెన్సీ ఇస్తారో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు. కానీ భవిష్యత్తులో మాత్రం సంజు ఖచ్చితంగా చెన్నై జట్టుకు కెప్టెన్సీ చేసే అవకాశముంది. శాంసన్ జట్టులోకి రావడం వలన టాపార్డర్ పటిష్టంగా మారుతుంది. మాత్రేతో శాంసన్ ఓపెనింగ్ చేస్తాడు. గైక్వాడ్ మూడో స్థానంలో ఆడతాడు. అయితే జడేజా లేని లోటును పూడ్చలేనిది. జడేజా స్థానంలో ఒక స్పిన్నర్ ను ఎక్కడ జుంచి తీసుకొస్తారు. అతనిలాంటి ఫీల్డర్ జట్టులోకి రావాలంటే కష్టం. ఫినిషింగ్ కూడా బలహీనమవుతుంది". అని అశ్విన్ 'ఆష్ కి బాత్' కార్యక్రమంలో అన్నారు.

►ALSO READ | Mohammed Shami: షమీని తప్పించడానికి కారణం ఏంటి..? సెలక్టర్లకు గంగూలీ సూటి ప్రశ్న

శాంసన్ చెన్నై జట్టులోకి రావడం అభిమానులను సంతోషపరుస్తుంటే.. మరోవైపు జడేజా లేడనే ఊహా ఫ్యాన్స్ ను కలవరానికి గురి చేస్తుంది. రెండు ఫ్రాంచైజీలు కలిసి ముగ్గురు ఆటగాళ్లతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఏ ఫ్రాంచైజీ కూడా అధికారికంగా ధృవీకరించలేదు. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ రెండు జట్లు కూడా ఈ ట్రేడ్‌లో పాల్గొన్న ముగ్గురు ఆటగాళ్ల పేర్లను పేర్కొంటూ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌కు పంపాలి. ట్రేడింగ్ రూల్స్ ప్రకారం, ఆటగాళ్ల వ్రాతపూర్వకంగా అనుమతి తీసుకుంటే గవర్నింగ్ కౌన్సిల్ ఆమోదించనుంది.