యాభై వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన సిద్దిపేట జిల్లా ములుగు ఎస్సై

యాభై వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన సిద్దిపేట జిల్లా ములుగు ఎస్సై

సిద్దిపేట జిల్లా: యాభై వేల రూపాయల లంచం తీసుకుంటూ సిద్దిపేట జిల్లా ములుగు ఎస్సై విజయ్ కుమార్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఓ బాధితురాలి డబుల్ బెడ్రూం విషయంలో ఒప్పందం చేసుకుని ఎస్సై విజయ్ కుమార్ డ్రైవర్ డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌‌ బెయిల్‌‌ ఇచ్చేందుకు లంచం డిమాండ్‌‌ చేసిన మణుగూరు ఎస్సైని ఏసీబీ ఆఫీసర్లు సెప్టెంబర్లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఖమ్మం జిల్లా వైరాకు చెందిన ఇద్దరు వ్యక్తులు మణుగూరులో రెండు కార్లను లీజుకు తీసుకొని తిరిగి యజమానులకు అప్పగించలేదు.

దీంతో కారు ఓనర్లు ఫిర్యాదు చేయడంతో ఇటీవల మణుగూరు పోలీస్‌‌స్టేషన్‌‌లో ఇద్దరిపై దొంగతనం కేసు నమోదు అయింది. ఈ కేసులో స్టేషన్‌‌ బెయిల్‌‌ ఇవ్వాలని సదరు వ్యక్తులు ఎస్సై బత్తిన రంజిత్‌‌ను కోరడంతో రూ. 40 వేలు ఇవ్వాలని డిమాండ్‌‌ చేశారు. ఎస్సై డబ్బులు అడిగిన విషయాన్ని రికార్డు చేసిన వారు ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. ఆడియో ఆధారంగా ఎంక్వైరీ చేసిన ఏసీబీ ఆఫీసర్లు స్టేషన్‌‌పై రైడ్ చేసి ఎస్సై రంజిత్‌‌ను అరెస్ట్‌‌ చేసి రిమాండ్‌‌కు తరలించారు.

►ALSO READ | క్రికెట్ బెట్టింగ్లో మోసపోయి అప్పులపాలు.. ఓయో రూంలో ప్రాణం పోయింది !