సంగారెడ్డి: క్రికెట్ బెట్టింగ్లో మోసపోయి అప్పులపాలైన యువకుడు ఓయో రూంలో ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. బీరంగూడ కమాన్ పక్కన ఉన్న లావీ షోక్ ఓయో రూంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అఖిల్ (30) నవంబర్10న ఓయోలో రూం తీసుకున్నాడు. తన తండ్రి సంగీత్ రావుకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని సమాచారమిచ్చాడు.
క్రికెట్ బెట్టింగ్లో మోసపోయి అప్పులపాలయ్యాయని అఖిల్ తన తండ్రికి చెప్పుకుని బాధపడ్డాడు. ఓయో రూంలో ఫ్యాన్కు ఉరేసుకుని ప్రాణం తీసుకున్నాడు. రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్ చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రామచంద్రాపురం సాయినగర్లో అఖిల్ కుటుంబం నివాసం ఉంటోంది.
►ALSO READ | హైదరాబాద్ యూసుఫ్గూడలో హైటెన్షన్.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అరెస్ట్
