హైదరాబాద్ యూసుఫ్గూడలో హైటెన్షన్.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అరెస్ట్

హైదరాబాద్ యూసుఫ్గూడలో హైటెన్షన్.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అరెస్ట్

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 2025 నవంబర్ 11న పోలింగ్ ప్రశాంతంగా ముగిసినప్పటికీ.. చివరల్లో బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగటం ఉద్రిక్తతకు దారితీసింది. యూసుఫ్ గూడలో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత యూసుఫ్ గూడలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. ఆమెకు తోడు పాడి కౌశిక్ రెడ్డి కూడా ధర్నాకు దిగటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. 

కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ముందు ఎందుకు ధర్నా చేస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రెండు పార్టీలకు మధ్య తోపులాటలు జరిగాయి. పరిస్థితి చేజారుతుండటంతో పోలీసులు కార్యర్తలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. 

ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎలాంటి గొడవలకు తావు లేకుండా సహకరించాలని చెప్పినా వినకపోవడంతో మాగంటి సునీతతో పాటు పాడి కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు.