IND vs SA: సౌతాఫ్రికాతో తొలి టెస్ట్.. మూడో స్థానంలో జురెల్ బ్యాటింగ్.. సుదర్శన్‌కు షాక్

IND vs SA: సౌతాఫ్రికాతో తొలి టెస్ట్.. మూడో స్థానంలో జురెల్ బ్యాటింగ్.. సుదర్శన్‌కు షాక్

సౌతాఫ్రికాతో నవంబర్ 14 నుంచి జరగనున్న తొలి టెస్టులో టీమిండియా ప్లేయింగ్ 11పై ఆసక్తి మొదలైంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ తొలి టెస్టుకు ఆతిధ్యమిస్తుంది. తొలి టెస్టుకు మూడో స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారనే విషయంలో తీవ్ర చర్చ నడుస్తోంది. పుజారా లేకపోవడంతో ఆ లోటును పూడ్చే సరైన వారు కనిపించడం లేదు. ఇంగ్లాండ్, వెస్టిండీస్ సిరీస్ లో కరుణ్ నాయర్, సాయి సుదర్శన్ ను మూడో స్థానంలో ఆడించినా వీరు పెద్దగా ఆకట్టుకోలేదు. ఇటీవలే వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో సాయి సుదర్శన్ నెంబర్ 3 లో పర్వాలేదనిపించాడు. అయితే సుదర్శన్ కు వికెట్ కీపర్ ధృవ్ జురెల్ గట్టి పోటీ ఇస్తున్నాడు. 

సౌతాఫ్రికా-ఏ తో జరిగిన రెండో టెస్టుల్లో రెండు ఇన్నింగ్స్ ల్లో సెంచరీ కొట్టి  తనకు రేస్ లో ఉన్నానని తెలిపాడు. తొలి రోజు ఆటలో భాగంగా గురువారం (నవంబర్ 6) తొలి ఇన్నింగ్స్ లో సెంచరీతో అదరగొట్టాడు. జట్టు మొత్తం విఫలమైనా ఒక్కడే సెంచరీతో పోరాడి జట్టును ఆదుకున్నాడు. 175 బంతుల్లో 132 పరుగులు చేసి జట్టు మొత్తం స్కోర్ లో సగం పరుగులు చేశాడు. శనివారం (నవంబర్ 8) మూడో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్ లో  జురెల్ తన సెంచరీ మార్క్ అందుకున్నాడు. భారత జట్టు రెండు ఇన్నింగ్స్ ల్లో కష్టాల్లో ఉన్నప్పుడు జురెల్ తన సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. అంతకముందు వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లోనూ సెంచరీతో సత్తా చాటాడు. 

మరోవైపు సాయి సుదర్శన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. సౌతాఫ్రికా -ఏ తో జరిగిన రెండు టెస్టుల్లో ఆకట్టులేకపోయాడు. దీంతో అతను ఆడుతున్న మూడో స్థానానికి ప్రమాదం ఏర్పడింది. సూపర్ ఫామ్ లో ఉన్న జురెల్ ను సౌతాఫ్రికాతో జరగబోయే తొలి ఆడించిన ఆశ్చర్యం లేదు. రిషబ్ పంత్ లేకపోవడంతో జురెల్ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసే అవకాశం లేదు. నాలుగు, ఐదు స్థానాల్లో వరుసగా గిల్, పంత్ బ్యాటింగ్ కు వస్తారు. ఆరో స్థానంలో ఇండియా ఆల్ రౌండర్ ను ఆడిస్తోంది. మూడో స్థానంలో మాత్రమే మిగిలి ఉంది. ఫామ్ లో ఉన్న జురెల్ ను తప్పించలేని పరిస్థితి. మరోవైపు మూడో స్థానంలో ఆడిన అనుభవం జురెల్ కు లేదు. దీంతో భారత యాజమాన్యం ఎవరివైపు మొగ్గు చూపుతుందో చూడాలి. 

►ALSO READ | IPL 2026: జడేజాను రిటైన్ చేసుకోవాలి.. CSK కోసం చేసిన పోరాటం మర్చిపోకూడదు: రైనా

సౌతాఫ్రికాతో నవంబర్ 14 నుంచి జరగబోయే తొలి టెస్టులో వికెట్ కీపర్ గా కాకుండా స్పెషలిస్ట్ బ్యాటర్ గా జురెల్ మూడో స్థానంలో  బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ కు పంత్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో జురెల్ తుది జట్టులో స్థానం సంపాదించి తనను తాను నిరూపించుకున్నాడు. పంత్ గాయం నుంచి కోలుకొని సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ కు ఎంపిక కావడంతో జురెల్ మరోసారి బెంచ్ కు పరిమితమనుకున్నారు. అయితే సూపర్ ఫామ్ లో ఉండడంతో జురెల్ కు ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.