ఎన్డీఏ గెలిస్తే అది జన్ సురాజ్ పార్టీ వల్లేనా.. కాంగ్రెస్ అవకాశాలను ప్రశాంత్ కిశోర్ దెబ్బతీశాడా..?

ఎన్డీఏ గెలిస్తే అది జన్ సురాజ్ పార్టీ వల్లేనా.. కాంగ్రెస్ అవకాశాలను ప్రశాంత్ కిశోర్  దెబ్బతీశాడా..?

బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటున్నట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. దాదాపు అన్ని సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ బీజేపీ-జేడీయూ కూటమికే అధికారం అని చెప్పేశాయి. 2025 నవంబర్ 11 వ తేదీన తుదిదశ పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. కాంగ్రెస్ పార్టీకి ఆశాజనకంగా రాలేదు. 

బీహార్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ప్రభుత్వ వ్యతిరేక కలిసొస్తుందనీ..  అదే విధంగా ఓట్ చోరీ ఒక అస్త్రంగా పనిచేస్తుందని భావించింది. కానీ.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తే అధికార పార్టీకే మరోసారి బీహారీలు పట్టం కట్టినట్లు వస్తున్నాయి. దీంతో ఎన్డీఏ కూటమి సంబరాల్లో ఉండగా.. మహాగట్బంధన్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తప్పవుతాయని భావిస్తోంది.

మహాగట్బంధన్ పార్టీలతో పాటు చాలా మంది విశ్లేషకులు ఈ సారి బీహార్ కాంగ్రెస్ కూటమిదే అని భావించారు. కానీ అందరి అంచనాలకు విరుద్ధంగా ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. 14 న విడుదలయ్యే ఫలితాలే నిర్ణయించాలి.. ఎగ్జిట్ పోల్స్ లో ఎంత వరకు నిజమయ్యాయనేది. 

►ALSO READ | బీహార్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం NDA దే అధికారం.. మహాగట్బంధన్ ఏమంటోంది..?

అయితే ఒక వేళ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం ఎన్డీఏ గెలిస్తే.. కాంగ్రెస్ కూటమి ఓటమికి ప్రశాంత్ కిశోర్ జన్ సురాజ్ పార్టీనే కారణం అవుతుందని అంటున్నారు. అన్ని ఎగ్జిట్ పోల్స్ లో జన్ సరాజ్ పార్టీకి 0 నుంచి 5 సీట్ల మధ్యలోనే ఇచ్చాయి. ఇంత తక్కువ సీట్లకు పరిమితమయ్యే పార్టీ కమహాగట్బంధన్ గెలుపుకు ఎలా అడ్డంకిగా నిలుస్తుందని అనుకోవచ్చు. దానికి కారణం.. సీట్లు తక్కువ వచ్చినా.. ఓట్ షేరింగ్ విషయంలో.. యాంటీ ఇన్ కంబెన్సీ.. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రతిపక్ష పార్టీకి పడకుండా జన్ సురాజ్ కు పడినట్లు చెబుతున్నారు విశ్లేషకులు. వ్యతిరేక ఓటు శాతం జన్ సురాజ్ కు వెళ్లినట్లు చెబుతున్నారు. గెలవడానికి ఎంతైతే మార్జిన్ అవసరమో అది ఈ పార్టీ తన్నుకుపోవడంతో మళ్లీ ఎన్డీఏనే అధికారం కైవసం చేసుకుంటుందని ఇవాళ్టి ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ఆధారంగా తెలుస్తోంది. 

దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ బీహార్ లో ఈసారి ఎన్డీయే కూటమిదే అధికారమంటూ అంచనాలు వెల్లడించాయి. పీపుల్స్ ఇన్ సైట్ ఎగ్జిట్ పోల్స్ 133 నుంచి 148 సీట్లతో ఎన్డీయే కూటమి అధికారమని దక్కించుకుంటుందని.. మహాఘట్ బంధన్ 87 నుంచి 102 సీట్లకే పరిమితం అవుతుందని అంచనా వేసింది.

బీహార్ ఎగ్జిట్ పోల్స్:

పీపుల్స్ ఇన్ సైట్:

NDA కూటమిదే అధికారమంటున్న పీపుల్స్ ఇన్ సైట్ 
NDA : 133  నుంచి 148 సీట్లు
మహాఘట్ బంధన్: 87 నుంచి 102
JSP : 0 నుంచి 2
ఇతరులు : 3 నుంచి 6 

పీపుల్స్ పల్స్:

NDA కూటమిదే అధికారమంటున్న పీపుల్స్ పల్స్
NDA: 133 నుంచి 159
మహాఘట్ బంధన్ : 75 నుంచి 101
JSP : 0 నుంచి 5
ఇతరులు: 2 నుంచి 8

పీ-మార్క్ ఎగ్జిట్ పోల్స్:

NDA: 142 నుంచి 162 సీట్లు
మహాఘట్ బంధన్: 80 నుంచి 98
JSP: 1 నుంచి 4
ఇతరులు: 0 నుంచి 3