బీహార్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం NDA దే అధికారం.. మహాగట్బంధన్ ఏమంటోంది..?

బీహార్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం NDA దే అధికారం.. మహాగట్బంధన్ ఏమంటోంది..?

బీహార్ లో పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చాయి. దాదాపు అన్ని సంస్థలూ ఎన్డీఏకు అనుకూలంగా ఇగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించాయి. 243 స్థానాలున్న బీహార్ లో బీజేపీ-జేడీయూ అలయన్స్ లో ఉన్న ఎన్డీఏ 130 స్థానాలకు తగ్గకుండా గెలుస్తుందని.. అధికారం చేపట్టనుందని సర్వే ఫలితాలు వచ్చాయి. దీంతో ఎన్డీఏ కూటమి నేతలు సంబరాల్లో మునిగారు. 

అయితే ఈసారి ఎలాగైనా బీహార్ ను కైవసం చేసుకోవాలని ప్రయత్నించిన కాంగ్రెస్-ఆర్జేడీ నేతృత్వంలోని మహాగట్బంధన్ కు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయి. దీనిపై ఆ కూటమి నేతల స్పందన కోసం అందరూ ఎదురు చూస్తున్న వేళ.. కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు స్పందించాయి. 

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఖచ్చితంగా చెప్పలేమని అన్నారుకాంగ్రెస్ పార్టీ ఎంపీ తారిఖ్ అన్వర్. అవి ఊహాగానాలేనని .. చెప్పింది చెప్పినట్లు ఫైనల్ రిజల్ట్స్ ఉండవని అన్నారు. ఈ ఫలితాలు వాస్తవం అని చెప్పలేమని అన్నారు. 

బీహార్ ఎన్నికల్లో మహాగట్బంధన్ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ సుప్రియా శ్రీనాతే అభిప్రాయం వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా ఎగ్జిట్ పోల్స్ పై కామెంట్స్ చేయలేమని.. కానీ .. తమ కూటమి కచ్చితంగా గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీహార్ అధికార కూటమికి కచ్చితంగా గుణపాఠం  చెబుతుందని అన్నారు. ఓటుహక్కును మాన్యుపులేట్ చేసిన పరిస్థితిలు ఇక్కడి ప్రజలకు తెలసునని అన్నారు. 

మరోవైపు ఎన్డీఏ నేత ఉమేశ్ కుమార్ కుశ్వాహ మాట్లాడుతూ.. బీహార్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. నితీశ్ కుమార్ సుపరిపాలనకు ఓటేసినందకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం నితీశ్ కుమార్ కు అభినందనలు తెలిపారు.