టాలీవుడ్ ఇండస్ట్రీలో యువ కథానాయికగా దూసుకుపోతున్న నటీమణి మీనాక్షి చౌదరి. 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ పొడుగు కాళ్ల సుందరి. ఆ తర్వాత రవితేజ, మహేష్ బాబు లాంటి పెద్దహీరోల సరసన నటించింది. ఇక మొన్నటికి మొన్న' సం క్రాంతికి వస్తున్నాం' సినిమాతో బంపర్ హిట్ అందుకుంది ఈ అందాల తార. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుని ఫుల్ క్రేజ్ ను సొంతం చేసుుకుంది.. ప్రస్తుతం విశ్వంభర సినిమాలో సదిస్తోంది.
ఫుల్ బిజీలో పొడుగు కాళ్ల సుందరి..
ప్రస్తుతం మీనాక్షి చౌదరి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న పీరియాడిక్ ఫాంటసీ చిత్రం 'విశ్వంభర'లో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రంపై ఉన్న అంచనాలు, మీనాక్షి కెరీర్‌కు మరింత బూస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు ఆమె స్టార్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'లక్కీ భాస్కర్' చిత్రంలో దుల్కర్ సల్మాన్‌తో జతకడుతోంది. ఈ క్రమంలోనే, తన భవిష్యత్తు సినిమాల ఎంపిక , పాత్రలపై మీనాక్షి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
తల్లి పాత్రలకు 'నో'
మీనాక్షి చౌదరి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తనకు ఏ కథ నచ్చినా, ఎలాంటి పాత్ర వచ్చినా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించింది. సీనియర్ హీరోలు అయినా సరే, వారి సరసన నటించడానికి తాను ఎలాంటి అభ్యంతరం చెప్పనని పేర్కొంది. అయితే, పాత్రల ఎంపిక విషయంలో తనకు ఒక స్పష్టమైన పరిమితి ఉందని మీనాక్షి వివరించింది. 'కథలో బలం ఉంటే నేను ఏ పాత్రనైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాను. కానీ, పిల్లల తల్లిగా కనిపించే పాత్ర వస్తే మాత్రం కచ్చితంగా రిజెక్ట్ చేస్తాను' అని ఆమె స్పష్టం చేసింది. 'లక్కీ భాస్కర్' సినిమా సమయంలో అనివార్య కారణాల వల్ల, ఆ పాత్రకున్న ప్రాధాన్యత దృష్ట్యా తల్లి పాత్రలో నటించడానికి ఒప్పుకోవాల్సి వచ్చిందని, అయితే ఇకపై అలాంటి పాత్రలు పోషించబోనని ఆమె వివరించింది.
ఒకవైపు తన గ్లామర్, ఫిట్‌నెస్‌తో యువతను ఆకర్షిస్తున్న మీనాక్షి, మరోవైపు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తన కెరీర్‌లో పకడ్బందీ ప్లాన్‌తో ముందుకు సాగుతోంది. త్వరలోనే ఆమె మరిన్ని క్రేజీ ప్రాజెక్టులను ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
