హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై వీ6-వెలుగు సర్వే చేసింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుస్తుందని వీ6-వెలుగు సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్ అభ్యర్థికి 50 నుంచి 55 శాతం, బీఆర్ఎస్ అభ్యర్థికి 40 నుంచి 45 శాతం, బీజేపీ అభ్యర్థికి 07 నుంచి 08 శాతం ఓట్లు పడ్డాయని వీ6 ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. పక్కాగా శాంపిల్స్ సేకరించి వీ6-వెలుగు సర్వే చేసింది. జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత, బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.
జూబ్లీహిల్స్‌లో మొత్తం 407 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. నియోజకవర్గంలో మొత్తం 4 లక్షల13 వందల 65 మంది ఓటర్లు ఉండగా.. 58 మంది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు, అదే రోజు ఫలితాల ప్రకటన ఉంటుంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భాగంగా 2025 నవంబర్ 11న ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం మందగొడిగా మొదలైన పోలింగ్.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 31.94 శాతం పెరిగింది. ఆ తర్వాత ఓటింగ్ శాతం పెరుగుతూ వచ్చింది. మధ్యా్హ్నం 3 గంటలకు 40.2 శాతం ఉన్న పోలింగ్.. సాయంత్రానికి 47.16 శాతానికి చేరుకుంది.
