ఆఫ్రికా దేశాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి మియాపూర్లో వ్యభిచారం

ఆఫ్రికా దేశాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి మియాపూర్లో వ్యభిచారం

హైదరాబాద్: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచార గృహం నడుపుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో వ్యభిచార గృహంలో మగ్గిపోతున్న నలుగురు విదేశీ మహిళలను మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మియాపూర్ న్యూ హఫీజ్ పేట్ సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీలో ఓ ఇంట్లో గుర్తు చప్పుడు కాకుండా ఈ విదేశీ మహిళలతో వ్యభిచారం చేయిస్తున్నారు.

మియాపూర్ పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా వ్యభిచారం గృహంలో తనిఖీలు చేశారు. కెన్యా దేశానికి చెందిన ఇద్దరు మహిళలు, ఉగాండా దేశానికి చెందిన ఇద్దరు మహిళలతో కలిసి లైబీరియా దేశానికి చెందిన డేరియస్ (28) వ్యభిచారం చేయిస్తున్నాడు. ఇతనిని పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు విదేశీ మహిళలను రెస్క్యు హోంనకు తరలించిన పోలీసులు.. డేరియస్ను రిమాండ్కు తరలించారు.

గత నెలలో (అక్టోబర్ 2025) నాగోల్ బండ్లగూడ పరిధి సహభవన్ టౌన్​షిప్లో బ్లాక్ నంబర్ సీ-5లోని ఓ  ప్లాట్లో షేక్ యేసు బాబు, పి. దుర్గ దంపతులు గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నడుపుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్కు చెందిన యువతులను తీసుకొచ్చి అదే అపార్ట్‌‌మెంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పక్కా సమచారంతో ఎల్బీ నగర్ ఎస్​వోటీ పోలీసులు దాడి చేశారు. నిర్వాహకులైన ఇద్దరు దంపతులను, ఒక విటుడిని అరెస్టు చేశారు. వీరి నుంచి సెల్​ఫోన్‌‌లు, రూ.2 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.