
- 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, ఎమ్మెల్సీకి చోటు
- హైదరాబాద్ కు రాజాసింగ్
హైదరాబాద్: పార్లమెంట్‌ఎన్నికలకు బీజేపీ కసరత్తు ప్రారంభించింది. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు ఇన్చార్జిలను ప్రకటించింది. ఈమేరకు బీజేపీ హైకమాండ్ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఒక ఎంపీ, 8 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో పాటు సీనియర్లీడర్లకు ఇన్‌చార్జ్‌లుగా బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ ఇన్‌చార్జ్‌గా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బీజేపీ హైకమాండ్బాధ్యతలు అప్పగించింది.
కాగా ఆ పార్టీ కీలక నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి తదితరులు ఎంపీ టికెట్ఆశిస్తున్న సంగతి తెలిసిందే.
ఎంపీ స్థానం ఇన్చార్జి
ఆదిలాబాద్ – పాయల్‌శంకర్
పెద్దపల్లి - రామారావు పవార్
కరీంనగర్ - ధన్పాల్సూర్యానారాయణ గుప్తా
నిజామాబాద్ - ఆలేటి మహేశ్వర్‌రెడ్డి
జహీరాబాద్ - వెంకటరమణారెడ్డి
మెదక్ - పాల్వాయి హరీశ్‌బాబు
మల్కాజిగిరి - పైడి రాకేశ్‌రెడ్డి
సికింద్రాబాద్ - కె. లక్ష్మణ్
హైదరాబాద్ - రాజాసింగ్
చేవెళ్ల - వెంకటనారాయణ రెడ్డి
మహబూబ్‌నగర్ - ఎన్.రామచందర్‌రావు
నాగర్‌కర్నూల్ - మారం రంగారెడ్డి
నల్లగొండ - చింతల రామచంద్రారెడ్డి
భువనగిరి - ఎన్వీఎస్ఎస్ప్రభాకర్
వరంగల్ - మర్రి శశిధర్‌రెడ్డి
మహబూబాబాద్ - గరికపాటి మోహన్‌రావు
ఖమ్మం -పొంగులేటి సుధాకర్