టిమ్స్ ను పరిశీలించిన బీజేపీ నేతలు

టిమ్స్ ను పరిశీలించిన బీజేపీ నేతలు

హైదరాబాద్‌: కరోనా పేషంట్ల కోసం తెలంగాణ ప్రభుత్వం గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన టిమ్స్‌ హాస్పిటల్‌ను బీజేపీ నేతలు గురువారం సందర్శించారు. టిమ్స్‌లో సరైన సదుపాయాలు లేవని, డాక్టర్ల కొరత ఉందని ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు. టిమ్స్‌ హాస్పిటల్‌లో వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. డాక్టర్లు, పారామెడికల్‌ సిబ్బందికి పీపీఈ కిట్లు లేవని, సిబ్బంది కూడా చాలా తక్కువ ఉన్నారని ఆయన విమర్శించారు. టిమ్స్‌లో 1200 బెడ్లు ఏర్పాటు చేసి పేషంట్లు అందర్నీ గాంధీ ఆసుపత్రికే ఎందుకు తరలిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇంత పెద్ద టిమ్స్‌లో కేవలం 40 మంది పేషంట్లు మాత్రమే ఉన్నారని అన్నారు. టిమ్స్‌లో డాక్టర్లను నియమించి పేషంట్లను అక్కడికి కూడా తరలించాలని, కరోనా పేషంట్లకు ప్రభుత్వం భరోసా కల్పించాలని చెప్పారు.