మహారాష్ట్రలో సింగిల్​గానే బీజేపీ పోటీ?

మహారాష్ట్రలో సింగిల్​గానే బీజేపీ పోటీ?

మహారాష్ట్రలో శివసేనకు సగం సీట్లు ఇవ్వడం ఇబ్బందేనంటున్న నేతలు

ఈ ఏడాది చివర్లో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ సింగిల్​గా పోటీచేయాలని భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈమధ్య బీజేపీలోకి కొత్త నేతల చేరికలు, టికెట్లు ఆశించేవాళ్ల సంఖ్య పెరగడంతో మిత్రపక్షం శివసేనతో సీట్ల పంపకం ఇబ్బందికరంగా మారిందని నేతలు వెల్లడించారు. ఆశించినన్ని సీట్లు సేనకు దక్కకపోవచ్చంటూ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​, రాష్ట్ర బీజేపీ చీఫ్​ చంద్రకాంత్‌‌‌‌ పాటిల్ చేసిన కామెంట్లతో ఇప్పుడీ అంశం చర్చనీయాంశమైంది.

మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలుండగా, మిత్రపక్షాలకు 18 సీట్లను వదిలేసి, మిగతావాటిని బీజేపీ, సేన చెరిసగం పంచుకోవాలని మొదట నిర్ణయించారు. ఫిబ్రవరిలో బీజేపీ చీఫ్​ అమిత్​ షాతో శివసేన చీఫ్​ ఉద్దవ్​ థాక్రే మధ్య చర్చల తర్వాత ఈ మేరకు ప్రకటన కూడా వెలువడింది. ఆ లెక్కన రెండు పార్టీలూ చెరో 135 స్థానాల్లో పోటీకి దిగాల్సిఉంది. ప్రస్తుతం బీజేపీకి సొంతగా 122 మంది ఎమ్మెల్యేలుండగా, ఆరుగురు ఇండిపెండెంట్లు బేషరతుగా మద్దతిస్తున్నారు. ఈమధ్యే కాంగ్రెస్​కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలూ బీజేపీలో చేరారు.

‘‘సిట్టింగ్​ ఎమ్మెల్యేలే బీజేపీ కి 132 మంది ఉన్నారు. అంటే ఇంకో ముగ్గురు కొత్తవాళ్లకు మాత్రమే చాన్స్ దొరుకుతుంది. ఇది కచ్చితంగా ఇబ్బందికర పరిణామమే. సీట్ల సర్దుబాటుపై కసరత్తు​ చేస్తున్నాం’’అని మహారాష్ట్ర బీజేపీ చీఫ్​ పాటిల్​ అన్నారు. సీఎం ఫడ్నవీస్​ కూడా సేన సీట్లలో కోత ఉండొచ్చని హింట్ ఇస్తూనే.. పొత్తు మాత్రం తెంచుకోబోమని క్లారిటీ ఇచ్చారు. ‘‘ప్రస్తుతం బీజేపీకి 122, శివసేనకు 63 మంది సిట్టింగ్​ ఎమ్మెల్యేలున్నారు  కాబట్టి ఆ 185 సీట్లపై లొల్లి ఉండదు. మిత్రపక్షాలకు కేటాయించాలనుకున్న 18 సీట్లలోనూ తేడా రాకపోవచ్చు. ఇవిపోను మిగతా స్థానాల్ని చెరిసగం పంచుకోవాలా లేక ముందే అనుకున్నట్లు మొత్తం సీట్లలో చెరిసగం పోటీకి దిగాలా అనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు’’అని ఫడ్నవీస్​ వివరించారు.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి