కరీంనగర్ లో బీజేపీ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ

 కరీంనగర్ లో బీజేపీ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ

బీజేపీ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ గురువారం కరీంనగర్​లో జరగనుంది. స్థానిక ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్​లో జరగనున్న ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. పార్టీ స్టేట్ చీఫ్ సంజయ్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్​లోనే సభ జరుగుతుండడం, దీనికి నడ్డా వస్తుండడంతో రాష్ట్ర నాయకత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. సభ జరిగే స్థలంలో సౌలతులు, జన సమీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టింది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో జనాన్ని తరలించడంపై ఫోకస్ పెట్టింది. సభ సక్సెస్ కోసం సంజయ్ ఇప్పటికే అన్ని జిల్లాల ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి బూత్ స్థాయిలో కార్యకర్తలను తరలించడంపై దిశా నిర్దేశం చేశారు. ఈ సభకు కనీసం లక్ష మందిని తరలించాలని టార్గెట్ పెట్టుకున్నారు. సంజయ్ అడ్డాలో నడ్డాకు ఘన స్వాగతం పలికేందుకూ కమలదళం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే కరీంనగర్ మొత్తం కాషాయమయం అయింది. సిటీలోని ప్రధాన రోడ్లకు ఇరువైపులా బీజేపీ అగ్ర నేతల భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, తోరణాలు ఏర్పాటు చేశారు. ఆరో విడత పాదయాత్ర హైదరాబాద్​లో కొనసాగేలా బీజేపీ ప్లాన్ చేసింది. ఈ ముగింపు సభలోనే ఆరో విడత యాత్ర షెడ్యూల్ ప్రకటించనుంది.