మిల్లర్లపై రెవిన్యూ రికవరీ యాక్టు ప్రయోగించాలె

మిల్లర్లపై రెవిన్యూ రికవరీ యాక్టు ప్రయోగించాలె

కామారెడ్డి: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో రైతులను ఇబ్బందిపెడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆరోపించారు. శనివారం జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బియ్యాన్ని దారి మల్లిస్తూ రైస్ మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. సర్కార్ కనుసనుల్లోనే మిల్లర్లు కోట్లాది రూపాయల అక్రమాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. మిల్లింగ్ కెపాసిటీ స్టోరేజి సౌకర్యాలు లేవనే సాకుతో లేవీ బియ్యాన్ని బహిరంగ మార్కెట్ లో విక్రయిస్తున్నారన్నారు. రెవెన్యూ రికవరీ యాక్టు ప్రయోగించి బియ్యం రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల తరఫున పోరాడుతున్న బీజేపీ నాయకులపై విమర్శలకు పాల్పడటం సరికాదని హితవు పలికారు. ఏ సీజన్ బియ్యాన్ని ఆ సీజన్ లోనే ఎఫ్సీఐకి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

మరిన్ని వార్తల కోసం...

ఢిల్లీ క్యాపిటల్స్‌ క్రీడా స్ఫూర్తిని మరచింది

గాడిదల పరుగు పందెం

V6 న్యూస్ చానెల్ కు జాతీయస్థాయి అవార్డు