ఎన్నికలు ఎప్పుడొచ్చిన బీజేపీ గెలుపు ఖాయం

ఎన్నికలు ఎప్పుడొచ్చిన బీజేపీ గెలుపు ఖాయం

ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని జేపీ నడ్డా సూచించినట్లు చెప్పారు. ప్రధాని సభ గ్రాండ్ సక్సెస్ అయిందన్నారు. బీజేపీ సమావేశాల సమయంలో ప్రజల సొమ్ముతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు ఏర్పాటు చేసుకుని వెకిలీ ఆనందం పొందుతుందన్నారు. బోనాలకు వచ్చినంత జనాలు రాలేదని రాష్ట్ర మంత్రులు మాట్లాడడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు అసలు పార్టీ మీటింగ్ ని బోనాలతో పోల్చడం ఏంటని ఆయన నిలదీశారు. మరోసారి అధికారంలోకి వస్తామని సీఎం కేసీఆర్ పగటి కలలు కంటున్నారని..ఈ సారి రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు.