రైతులకు విద్యుత్ సబ్సిడీలు ఇవ్వొద్దని బిల్లులో లేదు

రైతులకు విద్యుత్ సబ్సిడీలు ఇవ్వొద్దని బిల్లులో లేదు

కేంద్ర విద్యుత్ సవరణ బిల్లులో మోటార్లకు మీటర్లు పెట్టాలని ఎక్కడా లేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. అసెంబ్లీలో విద్యుత్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన..  విద్యుత్ సవరణ బిల్లులో సెక్షన్ 65లో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వొద్దని  కేంద్రం చెప్పలేదన్నారు. మోటార్లకు మీటర్లు పెడతారని కేంద్రంపై నిందలు మోపుతున్నారని మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేసి..కేంద్రాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారని రఘునందన్ రావు అన్నారు. 

కేంద్ర విద్యుత్ సవరణ బిల్లుపై చర్చ అవసరంలేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లుపై తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని గుర్తు చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వొద్దని కేంద్రం బిల్లులో చెప్పలేదని స్పష్టం చేశారు. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో కరెంట్ సరఫరా లేని 18వేల ఊర్లకు విద్యుత్ సరఫరా చేశారని వెల్లడించారు.