కేర‌ళ ఎన్నికల్లో యూడీఎఫ్  సెంచ‌రీ ఖాయం: పొంగులేటి

కేర‌ళ ఎన్నికల్లో యూడీఎఫ్  సెంచ‌రీ ఖాయం: పొంగులేటి

హైద‌రాబాద్, వెలుగు: కేర‌ళ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ మొత్తం140 సీట్లకుగాను 100కు పైగా సీట్లను గెలుచుకుంటుంద‌ని  మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌ర రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆడూరు, అరుణ్ ముల నియోజ‌క‌వ‌ర్గాల్లో నిర్వహించిన ప్రచారంలో  మాట్లాడుతూ.. రాహుల్, ప్రియాంక గాంధీల ప్రచారంతో కేరళలో ఈసారి ప్రభుత్వ ఏర్పాటు దిశ‌గా  యూడీఎఫ్  ప‌య‌న‌మ‌వుతోంద‌ని చెప్పారు.