గొత్తికోయ గ్రామాల్లో సోలార్ వెలుగులు

గొత్తికోయ గ్రామాల్లో సోలార్ వెలుగులు
  • రూ.17 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు 

హైదరాబాద్, వెలుగు: ములుగు జిల్లాలోని 85 గొత్తికోయ గ్రామాలకు సోలార్ విద్యుత్ కనెక్షన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.17 కోట్లను కేటాయిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఆయా గ్రామాల్లో నివసిస్తున్న 2,020 కుటుంబాలకు పూర్తి ఉచితంగా సోలార్ పవర్ అందజేయనున్నారు.

ఇందుకు సంబంధించి విద్యుత్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్ జీవో నంబర్ 5ను విడుదల చేశారు. ఈ పథకం అమలుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని టీజీ రెడ్ కో వైస్ చైర్మన్ అనిల్‌‌‌‌ను ప్రభుత్వం ఆదేశించింది. మారుమూల అటవీ ప్రాంతాల్లోని గొత్తికోయ ఆవాసాలకు గ్రిడ్ ద్వారా విద్యుత్ అందించడం కష్టతరం కావడంతో, ప్రభుత్వం ఈ సోలార్ ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో గొత్తికోయ గ్రామాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.