గద్దర్‌‌‌‌‌‌‌‌పై అమిత్‌‌‌‌షా కామెంట్లను  వాపస్‌‌‌‌ తీస్కోవాలి : పీసీసీ చీఫ్మహేశ్గౌడ్

గద్దర్‌‌‌‌‌‌‌‌పై అమిత్‌‌‌‌షా కామెంట్లను  వాపస్‌‌‌‌ తీస్కోవాలి : పీసీసీ చీఫ్మహేశ్గౌడ్
  • పీసీసీ చీఫ్​మహేశ్​గౌడ్ డిమాండ్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: ప్రజా యుద్ధనౌక గద్దర్ గురించి పార్లమెంట్‌‌‌‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడిన మాటలు సరైనవి కావని పీసీసీ చీఫ్​మహేశ్ గౌడ్ మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు బుధవారం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. గద్దర్‌‌‌‌‌‌‌‌పై అనుచిత వ్యాఖ్యలను అమిత్ షా వెంటనే వాపస్‌‌‌‌ తీస్కోవాలని డిమాండ్‌‌‌‌ చేశారు.

తెలంగాణ బతుకు చిత్రాన్ని తన పాట రూపంలో ప్రపంచానికి చెప్పిన ప్రత్యేక రాష్ట్ర పోరాట యోధుడు గద్దర్‌‌‌‌‌‌‌‌ను పార్లమెంట్‌‌‌‌లో అమిత్ షా అవమానించడం సరికాదన్నారు. బీజేపీ వ్యతిరేకంగా జీవితాంతం గద్దర్‌‌‌‌‌‌‌‌ పోరాడారన్నారు. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్​సభలో కేంద్రం బిల్లును ఆమోదించడాన్ని స్వాగతిస్తున్నామ అన్నారు.