గ్రామ పంచాయతీలకు రూ. 371.91 కోట్లు రిలీజ్

గ్రామ పంచాయతీలకు రూ. 371.91 కోట్లు రిలీజ్
  • 12,600 గ్రామ పంచాయతీలకు అందనున్న నిధులు

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలోని గ్రామ పంచాయతీ లకు కేంద్రం రూ. 371.91 కోట్లను రిలీజ్ చేసింది. రాష్ట్రంలోని 12,600 గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ‘అన్‌టైడ్’ (నిర్దిష్ట నిబంధనలు లేని) గ్రాంట్ల కింద మొదటి విడతగా ఈ నిధులు విడుదల చేసినట్టు పేర్కొంది. ఈ నిధులను స్థానిక అవసరాల మేరకు పంచాయతీలు వినియోగించుకోవచ్చని స్పష్టం చేసిం ది.

ఈ మేరకు మంగళవారం కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. తెలంగాణతో పాటు అరుణాచల్ ప్రదేశ్, గోవా, గుజరాత్, జార్ఖండ్, ఒడిశా, రాజస్తాన్, ఉత్తరఖండ్‌లోని పంచాయతీ రాజ్ సంస్థలు/రూరల్ లోకల్ బాడీలకు మొత్తంగా రూ.1,536.14 కోట్లు రిలీజ్ చేసింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ‘టైడ్’, ‘అన్‌టైడ్’ విభాగాల్లో ఈ నిధులను మంజూరు చేసినట్టు తెలిపింది.