
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ డెవలప్మెంట్పై మంత్రి కేటీఆర్‌తో చర్చకు సిద్ధమని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాల్ విసిరారు. భాగ్యనగరాన్ని నిర్మించిన కార్మికులకు ఇండ్లు లేకపోవడం బాధాకరమన్నారు. ఆదివారం బాలానగర్‌లోని ఇందిరానగర్ లో బీజేపీ ఆధ్వర్యంలో ఫ్రీ హెల్త్ క్యాంపును ప్రారంభించి మాట్లాడారు. లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తామన్న కేసీఆర్.. మాట తప్పారని మండిపడ్డారు. ఇందిరానగర్ లో కేటీఆర్ పర్యటించి బస్తీవాసుల బాధలు తెలుసుకోవాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యేకు లోకల్ సమస్యలు పట్టడం లేదని దుయ్యబట్టారు.