ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు

కేటీఆర్ నీకు చిత్తశుద్ధి ఉంటే జవహర్ నగర్, దమ్మాయిగూడ ప్రాంతాలకు వచ్చి రాంకీ డంపింగ్ యార్డ్ బాధితులు పడే ఇబ్బందులను తెలుసుకోవాలని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న రాంకీ డంపింగ్ యార్డ్ నిర్లక్ష్యం కారణంగా దమ్మాయిగూడ, జవహర్ నగర్ పలు కాలనీలల్లో డంపింగ్ యార్డ్ విషపు మురుగు నీళ్లు ఇండ్లలో చేరుతుంది. దీంతో అక్కడి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవాళ దమ్మాయిగూడలోని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా గోస బీజేపీ భరోసా కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆయన డంపింగ్ యార్డ్ బాధిత ప్రజలను కలిసి వారి గోడును విన్నారు. ప్రజల సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు కొంపల్లి మోహన్ రెడ్డి, దమ్మాయిగూడ బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.